: మీ తల్లిదండ్రుల దగ్గరకు తప్పకుండా చేరుస్తాను... గీతతో సుష్మాస్వరాజ్
మూగ, బధిర యువతి గీతను తప్పకుండా తన తల్లిదండ్రులకు వద్దకు చేర్చుతానంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆమెకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. నిన్న ఆమె గీతను కలిశారు. తాను బస చేసిన హోటల్ కు గీతను పిలిపించుకున్నారు. ఆమెను ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. సుమారు అరగంటపాటు ఆమెతో గడిపారు. సైగ భాషలో నిపుణులైన మోనికా పంజాబీ వర్మ ద్వారా గీతకు అర్థమయ్యేలా సుష్మ చెప్పారు. గీతను తప్పకుండా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చుతానని సుష్మ చెప్పారు. కాగా, గీత స్వయంగా కుట్టిన వస్త్రాన్ని సుష్మకు చూపించగా ఆమె ప్రశంసించారు. గీతను ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉంచారు. పదేళ్ల క్రితం భారత్ నుంచి తప్పిపోయి పాకిస్థాన్ కు చేరిన గీతను ఇటీవలే మనదేశానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.