: రణ్ వీర్ సింగ్ ఒప్పుకున్నాడు...మరి, దీపిక ఏమంటుందో చూడాలి!
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, హీరోయిన్ దీపికా పదుకునే గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే, వీటన్నింటిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రణ్ వీర్ తాజాగా నోరువిప్పాడు. దీపికను తాను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ అనుభవం కొత్తగా ఉందని చెప్పాడు. ఇలాంటి భావన ఇంతకుముందెన్నడూ కలగలేదని చెబుతున్నాడు. మరి దీనికి దీపిక ఏమంటుందో చూడాలి.