: వారికెందుకు మినహాయింపు?: ఢిల్లీ సర్కార్ కు హైకోర్టు ప్రశ్న
నూతన సంవత్సరం ప్రారంభం నుంచి ఢిల్లీలో సరి, బేసి సంఖ్యల విధానం అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన ద్విచక్ర వాహనాలు, మహిళలకు వర్తించకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహిళలు, ద్విచక్రవాహనాలకు మినహాయింపు ఎందుకు ఇస్తున్నారో వివరించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ అడిగింది. ఢిల్లీలో కాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తారో చెప్పాలంటూ హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైనాలోని బీజింగ్ తరహా సరి, బేసి సంఖ్యల నిబంధనను అమలు చేస్తామని వెల్లడించింది. హై కోర్టుకు చెప్పినట్టే నూతన సంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు చేయనుంది. అయితే నిబంధనలో మహిళలు, ద్విచక్రవాహనాలకు మినహాయింపు ఇచ్చింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను జనవరి 6కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.