: బాలిలో కాజల్...మాల్దీవుల్లో సోనమ్... న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్!
సినీ నటులు న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు రంగం సిద్ధం చేసుకున్నారు. కొంత మంది నటీనటులు న్యూఇయర్ వేడుకలను ఆదాయం సమకూర్చే వనరుగా భావిస్తే...మరి కొందరు మాత్రం సంబరాలు జరుపుకునేందుకు ప్రాముఖ్యత ఇస్తారు. టాలీవుడ్ అగ్రనటి కాజల్ అగర్వాల్ నూతన సంవత్సర వేడుకలు బాలి ద్వీపంలో జరుపుకునేందుకు వెళ్లింది. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ న్యూఇయర్ వేడుకలు జరుపుకునేందుకు మాల్దీవులకు వెళ్లింది. గ్యాంగ్ తో వెళ్లిన సోనమ్ ఫుల్ జోష్ లో ఉంది. టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరి కొందరు నటులు విదేశాల్లో న్యూఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నాహాలు చేసుకున్నారు.