: బొల్లారంలోని రాష్ట్రపతి విడిది గృహంలో తేనీటి విందు
బొల్లారంలోని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడిది గృహంలో తేనీటి విందు కార్యక్రమం జరిగింది. దానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉన్నతాధికారులు, ప్రతిపక్ష నేతలు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి శీతాకాల విడిది రేపటితో ముగియనుండటంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు ప్రణబ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.