: కువైట్ లో 545 మంది విదేశీయుల అరెస్టు...అత్యధికులు భారతీయులే!
కువైట్ పోలీసులు విదేశీయులే లక్ష్యంగా తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో 545 మంది విదేశీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు భారతీయులేనని సమాచారం. ఈ దాడుల్లో 66 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 25 మందికి జరిమానా విధించారు. అరెస్టు అయిన వారి వద్ద లభ్యమైన పత్రాలు కువైట్ రెసిడెన్సీ చట్టాలకు అనుగుణంగా లేవని వారు చెబుతున్నారు. ఈ దాడుల్లో సుమారు 500 మంది పోలీసులు, మరి కొందరు మున్సిపల్ సిబ్బంది పాలు పంచుకున్నారు. నకిలీ పత్రాలతో కువైట్ లో అక్రమంగా ఉంటున్న వారిని కనుగొనడమే ఈ దాడుల లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.