: అర్చకుడిపై దాడి చేసి హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు!
అర్చకుడిపై దాడి చేసి హుండీని దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. గాజువాకలోని బీహెచ్ పీవీ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో అర్చకుడి తలకు స్వల్పగాయమైంది. వైద్య చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.