: వివాదంలో సల్మాన్ 'ఖాన్ మార్కెట్ ఆన్ లైన్ పోర్టల్'
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల తన 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం 'ఖాన్ మార్కెట్ ఆన్ లైన్.కామ్' పేరుతో ఓ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ ఏర్పాటు చేశాడు. తాజాగా ఈ పోర్టల్ వివాదంలో పడింది. ఢిల్లీలో ఇదే పేరుతో 65 ఏళ్ల పాప్యులర్ 'ఖాన్ మార్కెట్' ఉంది. దానికి ట్రేడ్ మార్క్ కూడా ఉంది. ఈ మార్కెట్ కు అంతర్జాతీయంగా ఎంతో పేరుంది. అయితే ఇప్పుడు సల్మాన్ అదే పేరును తన సొంత బ్రాండ్ కు పెట్టుకోవడం వివాదంగా మారింది. దానిపై ఖాన్ మార్కెట్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ మెహ్రా మాట్లాడుతూ, సల్మాన్ తో ఈ విషయమై మాట్లాడతామని చెప్పారు. లేదంటే కేసు పెడతామని తెలిపారు.