: సఫారీలకు షాక్ ఇచ్చిన ఇంగ్లిష్ బౌలర్లు
సౌతాఫ్రికాను టెస్టులు వెక్కిరిస్తున్నాయి. భారత్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో 3-0తో ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా జట్టు తాజాగా ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ తో తొలి టెస్టు ఆడి ఘోరపరాజయం చవిచూసింది. తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులు చేసిన సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్ 303 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు 241 పరుగుల భారీ విజయం సాధించింది. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాట్స్ మన్ తోక ముడిచారు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్ లో సఫారీలు 1-0తో వెనుకబడ్డారు.