: ఆంద్రబీ పర్యటనపై సమాచారం లేదు: తెలంగాణ డీజీపీ
జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాది ఆంద్రబీ హైదరాబాదు పర్యటనపై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంద్రబీ హైదరాబాదు పర్యటనపై వార్తలు వస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. అయితే ఆమె హైదరాబాదు వచ్చినట్టు ప్రస్తుతానికి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వివాదాస్పద నేతైన ఆంద్రభీ గతేడాది హైదరాబాదు వచ్చి సిమి వ్యవస్థాపకుడు సలావుద్దీన్ కుటుంబాన్ని కలిసినట్టు సమాచారం. వారితో పాటు తాజాగా ఐఎస్ఐఎస్ లో చేరేందుకు ప్రయత్నించిన ముగ్గురు హైదరాబాదీలను ఆమె కలిసినట్టు తెలుస్తోంది. అయితే ఇది నిర్ధారణ కావాల్సి ఉందని, దీనిపై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.