: టీడీపీతో ఒప్పందంతోనే నల్గొండలో కాంగ్రెస్ గెలుపు: తెరాస నేత గట్టు రామచంద్రరావు
తెలుగుదేశం పార్టీతో చేసుకున్న లోపాయకారీ ఒప్పందంతోనే నల్గొండ స్థానిక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఫలితాల తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని మరోసారి స్పష్టమైందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారని, తెలంగాణను ముందుకు నడిపించే నేత కేసీఆర్ అని గ్రామస్థాయిలో సైతం ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.