: ఇంత కంటే గొప్పగా న్యూఇయర్ చేసుకోవడం సాధ్యమా?: సోనూ సూద్
నూతన సంవత్సర వేడుకల్ని ఒక్కొక్కరు ఒక్కోలా ప్లాన్ చేసుకుంటారు. సినీ తారలైతే విదేశాల్లోని బీచ్ రిసార్టుల్లో వినూత్నంగా చిరకాలం గుర్తుండేలా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. అందరికీ భిన్నంగా టాలీవుడ్ విలన్ సోనూ సూద్ చైనాలో జరుపుకుంటున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కుంగ్ ఫూ శిక్షకుల దగ్గర మెళకువలు నేర్చుకుంటున్న సోనూ సూద్ నూతన సంవత్సరం రోజు కూడా తన షెడ్యూల్ అదేనని స్పష్టం చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకుల దగ్గర ఓ విద్యను అభ్యసించడం కంటే ఉత్తమంగా న్యూఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోగలమా? అంటూ అభిమానులను ప్రశ్నించాడు. ఈ మేరకు తాను నేర్చుకున్న కుంగ్ ఫూ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. కాగా, సోనూ సూద్ 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో ప్రముఖ హాలీవుడ్ హీరో జాకీ చాన్ తో కలసి ఓ పాత్ర పోషిస్తున్నాడు.