: సుదూర లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన భారత సరికొత్త క్షిపణి


భారత నౌకాదళం, డీఆర్డీఓ, ఇజ్రాయిల్ ఆయుధ సంస్థ ఎల్టా సిస్టమ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ 'బరాక్-8' ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. అరేబియా సముద్రంలో నిలిపిన ఐఎస్ఎస్ కోల్ కతా యుద్ధ నౌకపై నుంచి దీన్ని ప్రయోగించగా, గాల్లోని లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. "భారత నౌకాదళం మరో మైలురాయిని అధిగమించింది. శత్రు క్షిపణుల నుంచి మరింత రక్షణ పొందే సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇకపై మరింత సుదూరంలోనే గాల్లోని లక్ష్యాలను నాశనం చేయవచ్చు" అని పేర్కొంది. అన్ని భారత యుద్ధ నౌకల్లో ఈ క్షిపణులను అమర్చనున్నట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News