: బాక్సైట్ పై చర్చతో దద్దరిల్లిన విశాఖ జడ్పీ సమావేశం...టీడీపీ నేతల దౌర్జన్యం
బాక్సైట్ పై విశాఖ జిల్లా పరిషత్ సమావేశం దద్దరిల్లింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలంటూ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. దీనిపై విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ అంశంలో గిరిజనుల మనోభావాలను వివరిస్తున్న సర్వేశ్వరరావు మైక్ ను కట్ చేయించారు. ఒకదశలో ఆయన చేతిలోని మైక్ ను లాక్కున్నారు కూడా. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అరకు ఎమ్మెల్యే వాకౌట్ చేశారు. కాగా, టీడీపీ నేతల తీరు ఆక్షేపణీయం అంటూ వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.