: డీడీసీఏ అవినీతి స్కాంలో జైట్లీ లేఖలను విడుదల చేసిన ఆప్
డీడీసీఏలో అవినీతి అంశంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. డీడీసీఏ స్కాంను కప్పిపుచ్చేందుకు అరుణ్ జైట్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆప్ ఆరోపిస్తోంది. ఈ మేరకు గతంలో అరుణ్ జైట్లీ రాసినవిగా భావిస్తున్న రెండు లేఖలను ఆమ్ ఆద్మీ పార్టీ నేడు మీడియాకు విడుదల చేసింది. డీడీసీఏ స్కాంలో అవినీతి అరుణ్ జైట్లీకి తెలిసే జరిగిందని ఆప్ స్పష్టం చేసింది. డీడీసీఏ స్కాంలో విచారణ నిష్పాక్షికంగా జరిగేందుకు అరుణ్ జైట్లీ తక్షణం పదవికి రాజీనామా చేయాలని ఆప్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో అవినీతిని అంతం చేస్తానని ప్రతినబూనిన ప్రధాని ఆయనను మంత్రి వర్గం నుంచి బహిష్కరించాలని సూచించింది. కాగా, ఈ వివాదంపై బీజేపీ నేతలు ఎంత స్థాయిలో విమర్శలు చేస్తే, అంతే ఘాటుగా ఆప్ సమాధానం చెబుతున్న సంగతి తెలిసిందే.