: కడప డీసీఎంఎస్ లో తిరుగులేని వైకాపా... వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వేమారెడ్డి
వైఎస్సార్ కడప జిల్లా రాజకీయాల్లో తమకు తిరుగులేదని వైకాపా మరోసారి నిరూపించుకుంది. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) వైస్ చైర్మన్ పదవిని ఆ పార్టీ నేత పాలగిరి వేమారెడ్డి దక్కించుకున్నారు. గత కొంత కాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉండగా, దీన్ని భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఆపై వేమారెడ్డి నామినేషన్ వేశారు. ఆయనపై పోటీ చేసేందుకు మరెవరూ ముందుకు రాకపోవడంతో, ఏకగ్రీవంగా ఎంపికయ్యారని ప్రకటించిన అధికారులు, వేమారెడ్డిని వైస్ చైర్మన్ గా నియమించినట్టు ప్రకటించారు. వైఎస్ జగన్ ఆశీస్సులున్న వేమారెడ్డికే ఈ పదవి దక్కుతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.