: విజయవాడలో సీడీ షాపులపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు!


విజయవాడలో పైరసీ మాఫియాపై దాడులు కొనసాగుతున్నాయి. పలు సీడీ షాపులపై ఫిల్మ్ ఛాంబర్ పైరసీ సెల్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో పైరసీ సీడీలను విక్రయిస్తున్న షాపులను అధికారులు సీజ్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి, 150 పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పైరసీ సీడీలను విజయవాడలో విక్రయించేవారు. ఇప్పుడు మాత్రం విజయవాడలోనే ఆయా పైరసీ సీడీలను తయారు చేస్తున్నారు. తాజాగా జరిపిన టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వేలకొద్ది సీడీలు బయటపడ్డాయి. వీటిలో లౌక్యం, లోఫర్, నవ మన్మథుడు వంటి పలు తాజా చిత్రాలకు సంబంధించిన పైరసీ సీడీలు ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, పైరసీకి పాల్పడుతున్న యజమానులను వదలమని, వారు ఎంతటివారైనా తమ నుంచి తప్పించుకోలేరని టాస్క్ ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. విజయవాడలోని అన్ని ప్రముఖ సీడీ షాపులపైనా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. గత మూడు రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయన్నారు.

  • Loading...

More Telugu News