: ఆటోమేషన్ ప్రభావం... భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్న స్టార్టప్ లు!


అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సేవలను వాడుకుంటున్న స్టార్టప్ కంపెనీలు, ఖర్చుల తగ్గింపు పేరిట భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఓ వినూత్న ఆలోచనతో సంస్థలు ప్రారంభించిన ఔత్సాహికులు, ఆపై భారీ స్థాయిలో ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని, ఇప్పుడు ఆటోమేషన్ పేరు చెబుతూ వారిని తొలగిస్తున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సంస్థ ఫుడ్ పాండాలో 2 వేల మందికి పైగా పనిచేస్తుండగా, 300 మందిని తొలగించింది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరబ్ కొచ్చార్ స్వయంగా తెలిపారు. 98 శాతం ఆర్డర్ ప్రాసెసింగ్ ఆటోమేషన్ ద్వారా జరుగుతోందని, అందువల్ల ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. ఇదొక్కటే కాదు. జొమాటో సంస్థ 300 మందిని తొలగిస్తే, టినీ ఔల్ 112 మందిని ఇంటికి పంపించి వేసింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న స్పూన్ జాయ్, ఢిల్లీ ఆఫీసును మూసివేసి ఉద్యోగులను రోడ్డున పడేయగా, ఢిల్లీ కేంద్రంగా హోం-కుక్డ్ ఫుడ్ అందిస్తున్న ఆన్ లైన్ సంస్థ లాంఘర్ కూడా ఇదే దారిలో నడిచింది. తమకు నిధుల సమీకరణ సమస్యలు లేవని, అందివచ్చిన సాంకేతికత కారణంగానే ఉద్యోగులకు పని లేకుండా పోతోందని, అందువల్ల తొలగింపులు తప్పడం లేదని ఈ సంస్థలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News