: టీడీపీలో చేరేందుకు నేను సిద్ధమే: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి


గత కొన్ని నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరే విషయంపై తాజాగా స్పందించారు. తాను తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే పార్టీలో చేరే అంశంపై టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పార్టీ ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వెళతానని చెప్పారు. అయితే ఆదినారాయణ చేరికను కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను చేర్చుకోవద్దని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో కొంతకాలం నుంచి టీడీపీలో ఆదినారాయణ చేరికపై స్తబ్ధత నెలకొంది.

  • Loading...

More Telugu News