: విజయకాంత్ 'ఉమ్మి'పై తమిళనాట ఆగ్రహ జ్వాల!


"మీకు ధైర్యముంటే ఇదే ప్రశ్న ముఖ్యమంత్రి జయలలితను అడగగలరా? అంత దమ్ము మీడియాకు ఉందా? థూ..." అంటూ తనను ప్రశ్నిస్తున్న మీడియాపై అనుచితంగా ప్రవర్తించిన డీఎండీకే అధినేత, సీనియర్ నటుడు విజయకాంత్ పై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. గత రెండు రోజులుగా ఆయన ఎక్కడకు వెళ్లినా ఓవైపు అన్నా డీఎంకే కార్యకర్తలు, మరోవైపు జర్నలిస్టు సంఘాలు అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. కడలూరులో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు విజయకాంత్ రాగా, పరిస్థితి అదుపుతప్పింది. ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని కోరుతూ, పలువురు ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. విజయకాంత్ బొమ్మలున్న ప్లెక్సీలను దహనం చేశారు. కాగా, ఆయన పార్టీని నిషేధించాలని అన్నాడీఎంకే పార్టీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. విజయకాంత్ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సంఘాలు చేస్తున్న డిమాండ్ పై ఆయనింకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News