: సరి-బేసి సంఖ్యల విధానాన్ని అందరూ స్వచ్ఛందంగా పాటించాలి: కేజ్రీవాల్


ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రవేశపెడుతున్న సరి-బేసి సంఖ్యల విధానాన్ని ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అందరూ పాటిస్తేనే ఈ ఫార్ములా విజయవంతం అవుతుందన్నారు. అందుకే ఈ విధానాన్ని ఒక ఉద్యమంలా అమలు చేయాలని ఢిల్లీ ప్రజలకు కేజ్రీ పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ వాహనాల వాడకాన్ని తగ్గిస్తే రాజధానిలో కాలుష్యాన్ని గణనీయంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీలో ఇవాళ పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన ఆయన, కాలుష్య నివారణ చర్యలకు తోడ్పతామని వారితో ప్రమాణం చేయించారు. వీధులను వాక్యూమ్ క్లీనర్లతో శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు. తూర్పు, పశ్చిమ ఢిల్లీలో రోడ్లు వేసి ఢిల్లీ గుండా వెళ్లే ట్రక్కులను అటువైపు మళ్లిస్తామని కేజ్రీ ఈ సందర్భంగా తెలిపారు.

  • Loading...

More Telugu News