: నేతాజీ వ్యూహానికి బ్రిటన్ చిత్తు...దాంతోనే భారత్ నుంచి నిష్ర్రమణ!: అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్య


దాదాపు 200 ఏళ్లకు పైగా భారత్ ను పాలించిన బ్రిటిషర్లు 1947లో స్వాతంత్ర్యం ఇచ్చి తమ దేశం వెళ్లిపోయారు. అయితే 1945లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న సమయంలో బ్రిటిషర్లు భారత్ కు స్వాతంత్య్రం ప్రకటించడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఉన్న అజిత్ దోవల్. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు అతివాదిగా ముద్రపడి దేశం వదిలివెళ్లిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యూహాలకు సతమతమైన కారణంగానే బ్రిటిషర్లు భారత్ నుంచి మూటా ముల్లె సర్దుకున్నారని దోవల్ చెప్పారు. నాడు సుభాష్ చంద్రబోస్ స్వయంగా భారత సైన్యంలో రేపిన చిచ్చుకు భయపడి బ్రిటిషర్లు బిచాణా సర్దేశారని ఆయన చెప్పుకొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిషర్లు రెట్టించిన ఉత్సాహంతో భారత్ లో పాలన చేయాల్సింది పోయి, ఎలాంటి పెద్ద కారణం లేకుండా వెళ్లిపోవడానికి కారణంగా నేతాజీనేనని దోవల్ పేర్కొన్నారు. దోవల్ ప్రసంగానికి సంబంధించి 6 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News