: ఢిల్లీలో మహిళల కోసమే ప్రత్యేకంగా మద్యం షాపు


మద్యం కొనుక్కోవాలని భావించే దేశ రాజధానిలోని మహిళలు ఇకపై ఎటువంటి సంకోచం లేకుండా షాపుకు వెళ్లవచ్చు. ఉత్తర ఢిల్లీలోని స్టార్ సిటీ మాల్ లో ఓ మద్యం షాపు ప్రత్యేకంగా మహిళల కోసమే ప్రారంభమైంది. ఇక్కడి సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు కూడా మహిళలే. షాపుకు సెక్యూరిటీ గార్డులుగా కూడా మహిళలే ఉంటారు. మద్యం కోసం వచ్చే యువతులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలన్న ఉద్దేశంతోనే, వారి కోసం ప్రత్యేక లేడీస్ జోన్ ఏర్పాటు చేశామని మాల్ నిర్వాహకులు చెబుతున్నారు. తమను ఎవరైనా చూస్తారనిగానీ, వేధింపులు ఎదురవుతాయని గానీ సంకోచం లేకుండా ఇక్కడికి రావచ్చని అంటున్నారు.

  • Loading...

More Telugu News