: మిసైళ్లు పేలుస్తూ, అమెరికాను రెచ్చగొట్టిన ఇరాన్!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పీచమణిచేందుకు వచ్చిన యూఎస్ యుద్ధనౌక యూఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ సహా మరో రెండు యుద్ధనౌకలకు అతి సమీపంలో ఇరాన్ మిసైళ్లను పేల్చింది. ఇవి ఏ షిప్ నూ లక్ష్యంగా చేసుకుని ప్రయోగించనప్పటికీ, సమీపంలోనే కొన్ని వాణిజ్య నౌకలు కూడా ఉండటంతో కొంత కలకలం చెలరేగింది. "ఈ మిసైళ్ల పేలుళ్లు మాకు చాలా దగ్గరగా కనిపించాయి. ఇది రెచ్చగొట్టే చర్చే" అని అమెరికా నౌకాదళ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఓ క్షిపణి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో పడిందని తెలిపారు. కాగా, ఫ్రాన్స్ కు చెందిన యుద్ధనౌకతో పాటు యూఎస్ఎస్ బుల్ కెల్లీ డిస్ట్రాయర్ నౌక కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్ వాదన మాత్రం మరోలా ఉంది. తాము టెస్ట్ ఫైరింగ్ జరపనున్నామని, నౌకలు పక్కకు తప్పుకోవాలని ముందే కోరామని ఇరాన్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News