: జనవరిలో రామ మందిరం బ్లూ ప్రింట్!... సుబ్రహ్మణియన్ స్వామి ట్వీట్స్
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రామ మందిరం నిర్మాణం కోసమంటూ రెండు లారీల ఇటుకలను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేతలు అక్కడికి తరలించేశారు. దీనిపై ఓ వైపు పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగానే, నిన్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన శర్మ, అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించారు. దీనిపై నేటి ఉదయం బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణియన్ స్వామి మరింత ఆసక్తికరమైన అంశాలతో ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు. వచ్చే నెల (జనవరి)లో రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ విడుదల కానుందని ఆయన ట్వీటారు.