: శ్రీవారికి ముస్లిం భక్తుడి 30 లక్షల కానుక
చెన్నైకి చెందిన అబ్బుల్ గనీ అనే ముస్లిం వ్యక్తి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పట్ల తన భక్తిని చాటుకున్నాడు. రూ.30 లక్షల విలువైన రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి కానుకగా ఇచ్చాడు. ఇవాళ దాన్ని శ్రీవారి ఆలయం ముందుకు తీసుకొచ్చి రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం రవాణాశాఖకు దానిని స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా దాత అబ్దుల్ గనీని టీటీడీ డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ తదితరులు సన్మానించారు. గతంలో అబ్దుల్ గనీ తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు వితరణగా అందజేశారు.