: కృతి సనన్ పక్కన కూర్చొని పైరసీ సినిమా చూస్తే..!

సినిమాల పైరసీ ఎంతగా చొచ్చుకుపోయిందో అందరికీ తెలిసిందే. ఓ చిత్రం విడుదలైన రోజునే దాని పైరసీ వర్షన్ స్మార్ట్ ఫోన్లలోకి చేరిపోతోంది. ఇక ఇటీవలి షారూఖ్, కాజోల చిత్రం 'దిల్ వాలే' పైరేటెడ్ వర్షన్ ను తన ఫోన్ లోకి ఎక్కించుకున్న ఓ వ్యక్తి, విమానంలో ప్రయాణిస్తూ, దాన్ని ఎదురుగా ఉన్న తెరపై ప్రొజక్ట్ చేసి మరీ చూస్తున్నాడు. పక్కనే హీరోయిన్ కృతి సనన్ కూర్చుని ఉంది. పైరసీని చూసిన ఆమె, అతనికి సర్దిచెప్పే ప్రయత్నం కూడా చేసింది. సినిమాను థియేటర్లో చూస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చని చెబుతున్నా అతను వినలేదు. దీంతో కృతి సనన్ కు ఒళ్లు మండిపోయింది. అతని ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఎవరూ పైరసీ వర్షన్ చిత్రాలను చూడవద్దని కోరింది. ఇక ఓ ఫ్లయిట్ బిజినెస్ క్లాసులో కూర్చున్న సదరు వ్యక్తి ఎవరా? అని ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు.