: పగలు పెరుగుతున్న వేడి, రాత్రి వణికించే చలి... తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణ మార్పు!


గడచిన వారం పది రోజులుగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతల్లో వింతైన మార్పు వచ్చింది. రెండు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండగా, రాత్రి పూట మాత్రం చలి పులి చంపేస్తోంది. ఆకాశంలో మేఘాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం నిపుణులు వ్యాఖ్యానించారు. ఇంకొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పగలు 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు, రాత్రుళ్లు 2 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో విపరీతమైన చలితో కూడిన గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News