: ఇక ప్రపంచంలోని ఫాస్టెస్ట్ బౌలర్ జోష్... షోయబ్ అక్తర్ రికార్డు బద్దలు
క్రికెట్ ప్రపంచంలో మరో రికార్డు బద్దలైంది. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా బంతులు విసిరిన పాక్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ రికార్డు చెరిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్ జోష్ హాజిల్ వుడ్ ఏకంగా 164.2 కిలోమీటర్ల (102 మైళ్లు) వేగంతో బంతి విసిరి సరికొత్త రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ రాజేంద్ర చంద్రికతో పాటు అందరినీ జోష్ బంతి ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, షోయబ్ 161.3 కి.మీ వేగంతో వేసిన బంతే, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగమైన బంతిగా నిలిచున్న సంగతి తెలిసిందే. కాగా, చానల్ 9 స్పీడో మీటర్ ఈ బంతి వేగాన్ని నమోదు చేయగా, సాంకేతిక తప్పిదాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో క్రికెట్ ఆస్ట్రేలియా యంత్రాలను పరిశీలిస్తోంది.