: నవాజ్, మోదీల కలయిక కంటే ఇదే పెద్ద చర్చ..: గౌతమ్ గంభీర్
దేశవాళీ క్రికెట్ పోటీల్లో భాగంగా జరుగుతున్న విజయ్ హాజారే టోర్నమెంటులో ధోనీ నేతృత్వంలోని జార్ఖండ్ జట్టును ఓడించిన తరువాత గౌతమ్ గంభీర్ ధోనీకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడని, వీరిద్దరికీ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని గత రెండు రోజులుగా పలు కథనాలు టీవీ చానళ్లు, పత్రికల్లో వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ అనంతరం ధోనీతో చేతులు కలిపిన చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. "ఈ షేక్ హ్యాండ్ ఇటీవలి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరియు నరేంద్ర మోదీల షేక్ హ్యాండ్ కన్నా ఇదే పెద్ద చర్చనీయాంశం. మీడియా... నిజాలు తెలుసుకోండి" అని వ్యాఖ్యానించాడు.