: ఖమ్మంలో గులాబీ గుబాళింపు... ఎమ్మెల్సీగా బాలసాని విజయం
తెలంగాణలో నేటి ఉదయం మొదలైన ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన గంటన్నరకే తొలి ఫలితం వెలువడింది. అందరూ ఊహించినట్లుగానే గులాబీ పార్టీ సత్తా చాటింది. తొలి ఫలితాన్ని కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లా స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలసాని లక్ష్మినారాయణ విజయం సాదించారు. 31 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మొత్తం ఆరు స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్ లో ఒక్క నల్లగొండ మినహా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. నల్లగొండలో మాత్రం మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.