: పాతబస్తీలో బైక్ రేసింగ్ లు... 18 మంది మైనర్లు సహా 97 మంది అరెస్ట్


హైదరాబాదు మహా నగరంలో బైక్ రేసింగులకు చెక్ పడట్లేదు. పోలీసులు ముప్పేట దాడి చేస్తున్నా, కుర్రకారు ప్రాంతాలను మారుస్తూ రీసౌండ్ చేసే బైకులతో దూసుకెళుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తొలుత ఔటర్ రింగు రోడ్డు, ఆ తర్వాత ట్యాంక్ బండ్ సమీపంలోని నెక్లెస్ రోడ్లపై జరుగుతున్న బైక్ రేసింగులకు పోలీసులు చెక్ పెట్టారు. అయితే పోలీసుల కళ్లుగప్పిన నగర యువత పాతబస్తీని వేదికగా చేసుకుని ఇటీవల పెద్ద ఎత్తున బైక్ రేసింగులకు పాల్పడుతోంది. ఇటీవల పాతబస్తీలో పలుమార్లు దాడులు చేసినా, వీటికి అడ్డుకట్ట పడలేదు. తాజాగా నిన్న రాత్రి దాదాపు వందమందికి పైగా కుర్రకారు పాతబస్తీలోని ఓ చోటకు చేరి బైక్ రేసింగులతో హోరెత్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 97 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 18 మంది మైనారిటీ తీరని బాలురున్నారు. వీరందరికీ వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News