: హేమమాలిని నృత్య పాఠశాలకు స్థలం కేటాయింపు


బాలీవుడ్ లో నాటి తరం నటి, ఎంపీ హేమ మాలిని స్థాపించనున్న నృత్య కళాశాలకు మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. సుమారు 2000 చదరపు మీటర్ల భూమిని కేటాయించారు. భరతనాట్యం కళాకారిణి అయిన హేమమాలిని ఈ నృత్య పాఠశాల స్థాపించేందుకు స్థలం కేటాయంచాలని సుమారు 20 ఏళ్ల క్రితం ‘మహా’ సర్కార్ ను కోరింది. ముంబయి నగర శివారు అంధేరిలోని అంబిలివి ప్రాంతంలో ఈ భూమి ఉంది. భూమి కేటాయించిన పత్రాలను రెవెన్యూ మంత్రి ఏకనాథ్ ఖడ్సే మంగళవారం నాడు తన అధికారిక నివాసంలో హేమమాలినికి అందజేశారు. హేమ మాలినికి కేటాయించిన నాట్య విహార్ కళా కేంద్ర ఛారిటీ ట్రస్ట్ లో ఓ ప్రాంతంలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని, దానిని ప్రజలకు అందుబాటులో ఉంచాలనే నిబంధన కూడా ఉందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News