: గవర్నర్ విందులో మనసు విప్పి మాట్లాడుకున్న చంద్రులు!


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ సాయంకాలం ఇచ్చిన విందులో ఏర్పాటు చేసిన స్పెషల్ డిష్ ల కంటే ఓ విషయం అందర్నీ ఆకట్టుకుంది. మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. గతంలో అమరావతి శకుస్థాపన సందర్భంగా బాబు బిజీగా ఉండగా, కేసీఆర్ తో నామమాత్రంగా సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఆ తరువాత పలు సందర్భాల్లో కలుసుకున్నప్పటికీ ఆహ్వానాలు, వ్యక్తిగత వివరాలు, కుశల ప్రశ్నలు తెలుసుకునేందుకే సమయం సరిపోయింది. తాజాగా జరిగిన రాష్ట్రపతి విందులో వీరిద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారు. ఈ అంశమే నేటి విందులో ప్రత్యేకతగా నిలిచింది. ఎప్పుడూ వీరిలాగే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారాలు లభిస్తాయని పలువురు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News