: ఇద్దరు చంద్రులు మళ్లీ కలిశారు... వేదిక రాజ్ భవన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కలుసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, బండారు దత్తాత్రేయతో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు, స్పీకర్లు, పలువురు మంత్రులు, విపక్ష నేతలు చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఇతర శాఖల అధికారులు సతీ సమేతంగా హాజరయ్యారు. హాజరైన వారిని గవర్నర్ నరసింహన్ స్వయంగా రిసీవ్ చేసుకోవడం విశేషం. కాగా, విందు కోసం పసందైన వంటకాలను సిద్ధం చేశారు. 8 గంటలకు రాష్ట్రపతికి అతిథులను పరిచయం చేస్తారు. 8:30 నిమిషాలకు విందు ప్రారంభం అవుతుంది.