: రాజస్థాన్ సచివాలయంలో చోరీ


24 గంటలూ అడుగడుగునా భద్రత, చుట్టూ కాంపౌండ్ వాల్, దానిపై కంచె... అయినా దొంగతనం జరిగింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రాంగణంలో విరాళాల డబ్బాను దొంగిలించి భద్రతా సిబ్బందికి షాకిచ్చారు. రాజస్థాన్ లోని సచివాలయ ప్రాంగణంలో ఉన్న శివాలయంలో పక్షుల సంరక్షణార్థం విరాళాల కోసం హుండీ ఏర్పాటు చేశారు. క్రిస్మస్ సందర్భంగా వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. సోమవారం సచివాలయం తెరుచుకోగా, విరాళాల డబ్బా లేకపోవడం గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆలయం తలుపులు పగులగొట్టి మరీ దానిని తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో 16 వేల రూపాయలు ఉంటాయని వారు వివరించారు.

  • Loading...

More Telugu News