: జనవరి 8కి వాయిదాపడ్డ ‘డయల్ యువర్ ఈవో’ : టీటీడీ అధికారులు
తిరుమలలో ప్రతి నెలా తొలి శుక్రవారం నిర్వహించే ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తొలి శుక్రవారం జనవరి 1వ తేదీన వచ్చిన కారణంగా ఈ కార్యక్రమాన్ని రెండో శుక్రవారం నాటికి వాయిదా వేసినట్లు చెప్పారు. జనవరి 8వ తేదీన ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందన్నారు. అంతేకాకుండా, జనవరి 1న విడుదల చేయాల్సిన ఆర్జిత సేవ, ఆన్ లైన్ టికెట్లు జనవరి 8వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, కొత్త సంవత్సరం నేపథ్యంలో తిరుమలకు చేరుతున్న భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు సమాచారం. దీంతో, తిరుమలలో న్యూ ఇయర్ నిబంధనలు కఠినతరం చేశారు. ఈ నెల 31 నుంచి జనవరి 3వ తేదీ వరకు అన్ని ప్రత్యేక దర్శనాల నిలిపివేతతో పాటు, గదుల ముందస్తు బుకింగ్ ను కూడా రద్దు చేసినట్లు ఈవో సాంబశివరావు మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.