: కడప సెంట్రల్ జైల్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
కడప కేంద్ర కారాగారం నుంచి ఖైదీలు పారిపోయిన సంఘటనకు బాధ్యులైన ఆరుగురిని సస్పెండ్ చేసినట్లు జైళ్ల శాఖ డీజీ కృష్ణంరాజు వెల్లడించారు. డిప్యూటీ సూపరిటెండెంట్ రామకృష్ణ, ఇద్దరు జైలర్లు శేషయ్య, గుణశేఖర్ రెడ్డి, ఇద్దరు డిప్యూటీ జైలర్లు బ్రహ్మానందరెడ్డి, గోవిందరావు, చీఫ్ వార్డర్ గోపాల నాయక్ ను సస్పెండ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీ కృష్ణంరాజు మాట్లాడుతూ, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే సదరు అధికారులను సస్పెండ్ చేశామన్నారు.