: ఫోన్ నెంబర్ ట్వీట్ చేసిన హాలీవుడ్ నటి


హాలీవుడ్ నటీమణులకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. దీంతో తమ అభిమానుల అభిమానం తెలుసుకునేందుకు వారు రకరకాల విధానాలు అవలంబిస్తుంటారు. అలాగే అమెరికా నటి, మోడల్ అంబర్ రోజ్ తన ఫోన్ నెంబర్ ను ట్వీట్ చేసింది. ఆమె ట్విట్టర్ ఖాతాను 31 లక్షల మంది అనుసరిస్తుంటారు. ఆమె ఫోన్ నెంబర్ ను ట్విట్టర్ ఖాతాలో చూసిన అభిమానులు ఆమెకు నేరుగా ఫోన్ చేయడం ప్రారంభించారు. మరి కొంత మంది నేరుగా మెసేజ్ లు పెట్టడం ప్రారంభించారు. ఈ తాకిడి తట్టుకోలేని రోజ్ నిమిషాల వ్యవధిలో ఫోన్ నెంబర్ ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించింది. అయినప్పటికీ అభిమానులు ఫోన్లు ఆగితేనా?... గతంలో కేటీ పెర్రీ, చార్లీ షీన్ తదితరులు కూడా తమ ఖాతాలలో ఫోన్ నెంబర్లు ఉంచి ఇబ్బందులు పడ్డారు.

  • Loading...

More Telugu News