: నీటి పనుల టెండర్లను లాక్కెళ్లిన వైకాపా కార్యకర్తలు!


గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్లలో నీటి పారుదల శాఖ పిలిచిన పనుల టెండర్లను ఓ వైకాపా నేత అనుచరులు లాక్కెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. పలు అభివృద్ధి పనుల నిమిత్తం గతంలో టెండర్లను పిలువగా, వాటిని ఈ మధ్యాహ్నం స్థానిక ఎస్ఈ కార్యాలయంలో ఓపెన్ చేశారు. ఈ సమయంలో మాచర్లకు చెందిన వైఎస్ఆర్ పార్టీ ప్రధాన నేత అనుచరులు వీరంగం సృష్టించి, పలువురు కాంట్రాక్టర్లు వేసిన కాంట్రాక్టు పేపర్లను లాక్కెళ్లారు. వీరు ఎవరన్న విషయం కచ్చితంగా తెలియనప్పటికీ, వీరంతా మాచర్ల నేత అనుచరులేనని ఇతర కాంట్రాక్టర్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News