: అమీర్ ఖాన్, అనుష్క శర్మ 'హాటెస్ట్ వెజిటేరియన్లు'
అమితాబ్ బచ్చన్, షాహిద్ కపూర్, ఆర్.మాధవన్, ధనుష్, అలియా భట్, కంగనా రనౌత్ వంటి నటీ నటులను పక్కన పెట్టి అమీర్ ఖాన్, అనుష్క శర్మ పెటా అవార్డులను గెలుచుకున్నారు. పెటా నిర్వహించే 'హాటెస్ట్ వెజిటేరియన్' అవార్డుకు పలువురు సెలబ్రిటీలను పెటా నామినేట్ చేసింది. వీరి నుంచి ఉత్తమ వెజిటేరియన్లను ఎంచుకోవాలని వారి అభిమానులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పెటా.కామ్ లో వారి ఫోటోలను ఉంచి ఓట్లు వేయాలని సూచించింది. ఈ ఎంపికలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ విజేతలుగా నిలిచారు. పూర్తి స్థాయి 'వెగర్' (జంతువులకు సంబంధించిన పాలు, గుడ్లు, తోలు, తేనె, ఫర్, పట్టు, ఊలు, ఆఖరుకు జంతు ఉత్పత్తులతో తయారైన సోపులు కూడా వాడని వారు వెగర్ లుగా పేర్కొంటారు) గా మారుతున్నానని అమీర్ ప్రకటించగా, తాను వెజిటబుల్స్, పండ్లు, నీళ్లు ఎక్కువ తీసుకుంటానని అనుష్క ప్రకటించిన సంగతి తెలిసిందే.