: జపాన్ సముద్ర తీరంలో కనిపించిన వింత జీవి


జపాన్ సముద్రతీరంలో వింత జీవి కనిపించి మత్స్యకారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సెంట్రల్ జపాన్ లోని టొయామా బే తీరంలో 12 నుంచి 13 అడుగుల పొడవు ఉన్న వింత జీవి మత్స్యకారుల పడవల కిందుగా వెళ్లి ఆశ్చర్యపర్చింది. ఈ జీవిని పలువురు మత్స్యకారులు చూడగా, దీనిని సముద్రంలో అమర్చిన కెమెరా వీడియో తీసింది. కొన్ని గంటల పాటు బే ఏరియాలోని సముద్ర ఉపరితలంపై తిరుగాడిన ఈ వింత జీవిని అక్కడి ప్రజలు, మత్స్యకారులు ఆసక్తిగా వీక్షించారు. ఈ తరహా అరుదైన జీవులలో ఇది చిన్నదని, ఇది సుమారు 43 అడుగుల పొడవు పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. సముద్రం లోపల ఉండే ఈ జీవులు అరుదుగా ఇలా కనువిందు చేస్తాయని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News