: 20 లక్షల మందిపై కొత్త వంట గ్యాస్ రూల్ ప్రభావం... నిజానిజాలు!


వంట గ్యాస్ సబ్సిడీపై కేంద్రం నిన్న ప్రకటించిన నిబంధనలతో 20 లక్షల మంది తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ ను మార్కెట్ ధరపై కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని నిజాలు... * గ్యాస్ వినియోగదారుడు లేదా అతని భర్య / భార్య ఆదాయం సంవత్సరానికి రూ. 10 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే అతను / ఆమె సబ్సిడీకి అనర్హులు. * 2015 ఆర్థిక సంవత్సరపు అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను వివరాలు సమర్పించిన వారిలో 20 లక్షల మంది వరకూ రూ. 10 లక్షల కన్నా అధిక ఆదాయాన్ని చూపారు. * ప్రస్తుతానికి లబ్ధిదారుల స్వీయ హామీతోనే సిలిండర్లను సరఫరా చేస్తారు. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు పరిశీలనలోకి వస్తాయి. * ఈ నిర్ణయంతో కేంద్రానికి సాలీనా రూ. 400 కోట్ల వరకూ మిగులుతుందని అంచనా. * 2014-15లో గ్యాస్ సబ్సిడీ నిమిత్తం కేంద్రం రూ. 40,551 కోట్లను వెచ్చించింది. ఈ సంవత్సరం క్రూడాయిల్ ధరల పుణ్యమాని అది రూ. 8,814 కోట్లకు తగ్గింది. (ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య) * ప్రస్తుతం ప్రతి లబ్ధిదారుడికీ సంవత్సరానికి 14.2 కిలోల బరువున్న 12 సిలిండర్లు సబ్సిడీపై రూ. 419.26కు లభిస్తున్నాయి. * చమురు ధరల పతనం పుణ్యమాని సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ల ధరలో వ్యత్యాసం తగ్గింది. * ప్రస్తుతం సబ్సిడీ లేని సిలిండర్ల ధర రూ. 608 మాత్రమే. * ప్రస్తుతం ఇండియాలో 16.35 కోట్ల కనెక్షన్లు ఉండగా, అందులో 14.78 కోట్ల కనెక్షన్లు సబ్సిడీపైనే నడుస్తున్నాయి. * ఇటీవలి కాలంలో 57.50 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు తమకు సబ్సిడీ వద్దని స్పష్టం చేశారు. * సబ్సిడీ బిల్లు తగ్గడం వల్ల ద్రవ్యలోటు దిగివస్తుంది. దీని వల్ల సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత పెరుగుతుంది.

  • Loading...

More Telugu News