: టీడీపీ...కాల్ మనీ కీచకులను కాపాడే ప్రయత్నం చేస్తోంది: సీపీఐ నారాయణ
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కాల్ మనీ కీచకులను టీడీపీ కాపాడే ప్రయత్నం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కాల్ మనీ కీచకుల కేసును నీరుగార్చే కుట్రలో భాగంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ను, ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారాన్ని ఒకే గాటన కట్టకూడదని ఆయన తెలిపారు. ఈ రెండింటిని ఒకే గాటన కట్టి, కాల్ మనీ కీచకులను టీడీపీ కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కాల్ మనీ పేరిట మహిళలను వేధించిన వారికి ఉన్న పలుకుబడులు బాధితులకు న్యాయం జరగనీయకుండా ఆపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.