: 'కిల్లింగ్ వీరప్పన్'పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్


దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కిల్లింగ్ వీరప్పన్'కు మళ్లీ సమస్యలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన పన్నీర్ సెల్వి అనే మహిళ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరప్పన్ చిత్రం మొత్తం తప్పుల తడకగా ఉందని, విడుదలను ఆపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు. దాంతో పాటు వీరప్పన్ సినిమాకు జారీ చేసిన 'యు' సర్టిఫికెట్ ఉపసంహరించుకోవాలని సీబీఎఫ్ సీ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా కోరారు. వీరప్పన్ హత్యకు సంబంధించి ఈ సినిమాలో అవాస్తవాలను చూపారని సెల్వి వాదిస్తున్నారు. అలాంటి ఈ చిత్రం జనం మధ్యకు వెళితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాలో తమిళనాడు పోలీసులు, రాజకీయవేత్తలను తీవ్రంగా అవమానించారని పిటిషన్ దారు ఆరోపిస్తున్నారు. దాంతో ఈ సినిమా విడుదల ప్రశ్నార్ధకంగా మారింది.

  • Loading...

More Telugu News