: తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు: బొత్స


ఏపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో రూ.లక్షల కోట్ల ప్రజాధనం దర్వినియోగం అవుతోందని ఆరోపించారు. తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, టీడీపీ దోపిడీ విధానాన్నే వ్యతిరేకిస్తున్నామని బొత్స తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. సింగపూర్ తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో లొసుగులు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. సామాన్యుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను సింగపూర్ లోని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం వాస్తవం కాదా? అని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News