: స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం గోవా గవర్నర్ పాట!


గోవా గవర్నర్ మృదులా సిన్హా తనలోని సృజనాత్మకతను బయటపెట్టారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కోసం పెన్ను పట్టి పాట రాశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన ఆవశ్యకతను గవర్నర్ ప్రధానంగా పాటలో పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి అంశాలను ఈ పాటలో ప్రస్తావించారు. అంతేగాక విద్యార్థులతో చేయించే ఓ ప్రతిజ్ఞ కూడా ఉంది. ఇప్పుడా పాటలోని కొన్ని స్లోగన్ లను ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ముద్రిస్తున్నారు. కాగా మృదులా సిన్హా ప్రస్తుతం ఆ రాష్ట్ర స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా ఉన్నారు.

  • Loading...

More Telugu News