: మోదీకి ఒబామా ఆహ్వానం... పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు కూడా!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. కొత్త ఏడాది మార్చిలో అమెరికాలో అణు భద్రతపై సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలని మోదీకి ఒబామా ఆహ్వానం పంపారు. ఇక భారత దాయాది దేశం పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు కూడా ఒబామా ఆహ్వానం పంపారని ‘ద ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. అయితే ఈ ఆహ్వానాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ధ్రువీకరించలేదు. సదస్సులో భాగంగా భారత్, పాక్ ల మధ్య మరింత స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరిచే దిశగా ఒబామా చర్యలు చేపడతారన్న వాదన వినిపిస్తోంది.