: మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్ లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు వరంగల్ డీఐజీ మల్లారెడ్డి ఎదుట లొంగిపోయారు. అశోక్ దండ కారణ్య కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న అశోక్... పలు కీలక కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ సోదరుడే ఈ అశోక్ అని చెప్పారు. అతని స్వస్థలం చిట్యాల మండలం వెలిశాల అని పోలీసులు వివరించారు.