: ఐపీఎల్ లో ఏబీని చూడలేమా?... స్వదేశీ జట్టుకు ఆడటానికే ప్రాధాన్యమని ప్రకటన
అతడు క్రీజులో ఉన్నాడంటే పెను విధ్వంసమే. ప్రత్యర్థి జట్టు ఏదైనా, బౌలర్ ఎంతటి వాడైనా అతడికి లెక్కే లేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లోనే సత్తా కలిగిన బ్యాట్స్ మన్ గా కీర్తినందుకుంటున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్... విశ్వవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఐపీఎల్ లో ఆడే విషయం ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటికి నిన్న తన రిటైర్మెంట్ పై వెలువడిన వదంతులను వెనువెంటనే ఖండించిన సందర్భంగా అతడు సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ లో తన స్వదేశీ జట్టుకు ఆడేందుకే ప్రాధాన్యమిస్తానని అతడు సుస్పష్టంగా పేర్కొన్నాడు. ‘‘ఐపీఎల్ లో ప్రారంభం నుంచి చివరి దాకా ఆడితే బాగా అలసిపోతాను. ఫిట్ గానే కాక ఫ్రెష్ గానూ ఉండాలంటే అన్ని సిరీస్ లలో ఆడటం కుదరదు. అందుకే సొంత జట్టుకు ఆడటానికే ప్రాధాన్యమిస్తా’’ అని అతడు కుండబద్దలు కొట్టాడు.